తెలంగాణ గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆమె మాట్లాడుతూ..ఈ మూడేళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఎక్కడా ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు. అలాగే సమ్మక్క సారలమ్మ జాతరలో హెలికాఫ్టర్ అడిగితే ఇవ్వలేదని దీనితో 8 గంటలు రోడ్డు ప్రయాణం చేయవలసి వచ్చిందన్నారు.