ఫస్ట్ టర్మ్ పరీక్షలు రాసిన 10, 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ శుభవార్త చెప్పింది. దాదాపు 33 లక్షల మంది విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది సీబీఎస్ఈ బోర్డు. టర్మ్ 1 పరీక్షల్లో ఏ ఒక్క విద్యార్థిని కూడా ఫెయిల్ చేయకూడదని నిర్ణయించింది.
అయితే, కేవలం మార్కులు మాత్రమే కేటాయించనున్నట్లు వెల్లడించింది. టర్మ్ 1 బోర్డ్ ఎగ్జామ్స్ సాధారణం కంటే కఠినంగా ఉన్నాయని విద్యార్థులు ఆందోళనకు దిగడంతో సీబీఎస్ఈ తాజా నిర్ణయం తీసుకుంది.
బోర్డు ప్రకారం, టర్మ్ 1 బోర్డు పరీక్ష ఫలితాల్లో మార్కులు మాత్రమే ఉంటాయి. విద్యార్థులకు పాస్, ఫెయిల్, రిపీటర్ లేదా కంపార్ట్‌మెంట్ గ్రేడ్‌లను కేటాయించదు. అయితే, టర్మ్–2 పరీక్షలు ముగిసిన తర్వాత మాత్రం పాస్ లేదా ఫెయిల్ మెరిట్ జాబితాను రిలీజ్ చేయాలని బోర్డు సూచించింది. టర్మ్ 1, టర్మ్ 2, ఇంటర్నల్ఎవల్యూషన్స్కోర్ల ఆధారంగా తుది ఫలితాన్ని ప్రకటిస్తుంది.
CBSE టర్మ్ 1 బోర్డ్ పరీక్ష ఫలితాలు త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. CBSE 10వ తరగతి,12వ తరగతి టర్మ్ 1 బోర్డ్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులందరూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in లేదా cbseresults.nicలను నిశితంగా పరిశీలించాలని సూచించారు.