ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. నాయీ బ్రాహ్మణులు, వారి సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్న కొన్ని పదాలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఆ పదాలు ఇవే..
నాయీ బ్రహ్మణులు, వారి సామాజికవర్గానికి చెందిన వారిని కించపరిచేలా మంగలోడు, బొచ్చుగొరిగేవాడు, మంగలిది, కొండ మంగలోడు వంటి పదాలను వాడవద్దంటూ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయీబ్రహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.