సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన స్థానంలో సంగారెడ్డి కార్యకర్తలకే అవకాశమిస్తామన్నారు. క్యాడర్ కోరితే తన భార్య నిర్మలను బరిలోకి దింపుతానన్నారు. మళ్లీ 2028 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానన్నారు. తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.