టీటీడీ తిరుమల భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి పాదాలకు శనివారం నుంచి ఆర్టీసీ సర్వీసులను నడిపేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు ఆర్టీసీ బస్సును శ్రీవారి పాదాలకు ప్రయోగాత్మకంగా నడిపారు. ట్రయల్ రన్ సమయంలో చిన్న లోటు పాట్లను గుర్తించారు. అవసరమైన చోట మలుపుల్లో మరమ్మతులు చేశారు.
ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు వెళ్లడానికి సమస్యలు లేక పోవడంతో శనివారం నుంచి శ్రీవారి పాదాలకు, మార్గ మధ్యంలోని శిలాతోరణానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను మొదలు పెట్టనున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు బస్సు అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకున్నారు.
తిరుమల నుంచి శ్రీ వారి పాదాలకు రానుపోను రూ.55 గా టికెట్టు ధరను నిర్ణయించారు.అటు కరోనా కేసులు తగ్గుముఖం పడితే.. ఈ నెల 15 తర్వాత భక్తులకు సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ప్రకటన చేశారు.