మా జీతాలు ఎప్పుడిస్తరు సారూ : ఆ శాఖ ఉద్యోగుల ఆకలిమంటలు

0
92

సగం నెల గడుస్తున్నా తెలంగాణలో సెర్ప్ ఉద్యోగులకు జీతాలు అందలేదు. దీంతో సెర్ప్ ఉద్యోగుల కుటుంబాలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై తమకు జీతాలు తక్షణమే చెల్లించాలంటూ సెర్ప్ ఉద్యోగుల జెఎసి నేతలు కుంట గంగాధర్ రెడ్డి, ఏపూరి నర్సయ్య, సుభాష్ గౌడ్, మహేందర్ రెడ్డి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాము.

గౌరవ SERP అధికారులకు నమస్కారం. ప్రభుత్వం 5వ తేదీన గత నెల జీతం డబ్బులు SERP ఖాతాలో జమ చేసినప్పటికీ , 12వ తేది వచ్చినప్పటికీ ఇంకా సిబ్బందికి సాలరీస్ ఇవ్వడం లేదు!!!
అడిగితే ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుందో చెప్పడం లేదు!!!!

అసలు ఈ నెల డబ్బు ఉన్నాకూడా సాలరీ ఎందుకు ఆపారో చెప్పడం లేదు. గత రెండు నెలలుగా అర్హులకు వార్షిక ఇంక్రిమెంట్ లు ఇవ్వడం లేదు,
30% పెంపుకు సంబంధించి జూన్ ఎరీయర్స్ ఇవ్వడం లేదు, వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న ఇంక్రిమెంట్ ఎరియర్స్ కూడా విడుదల చేయడం లేదు..

గత 21సం.లలో ఎన్నడూ లేనివిధంగా గత సం.కాలంగా ప్రతి నెల సాలరీ ఆలస్యం చేస్తున్నారు..
గత సంవత్సరం వరకు SERP లో ప్రతి నెల 5వ తేదీ లోపే వేతనాలు ఇచ్చేవారు..
ముఖ్యంగా కేటీఆర్ గారు PR,RD మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి నెల 5వ తేదీ లోపు అడ్వాన్స్ అండ్ అడ్జస్ట్మెంట్ పద్ధతి ప్రకారం SERP లో జీతాలు ఇచ్చారు

కానీ గత సంవత్సర కాలంగా ఎందుకు ఈ అడ్వాన్స్ అండ్ అడ్జస్ట్మెంట్ పద్ధతిని పక్కన పెట్టారో SERP అధికారులు చెప్పడంలేదు..

SERP ఫైనాన్స్ విభాగంలో పై సమస్యలు ఇలా ఉండగా, మరో పక్క హెచ్ ఆర్ విభాగంలో సమస్యలన్నీ సంవత్సర కాలంగా పెండింగ్లోనే ఉన్నాయి..
బదిలీల ప్రక్రియ చేపట్టడం లేదు, సిబ్బంది రియిన్ స్టేట్మెంట్ ఫైల్లు, ఎఫెక్ట్ డేట్ ఫైల్లు, హెచ్ఆర్ సంబంధించిన ఎన్నో రకాల ఫైల్లు ఏడాది కాలంగా పెండింగ్ లోనే ఉంటున్నాయి..

50 లక్షల మహిళల కుటుంబాలకు మార్గ దర్శకత్వం చేస్తున్న SERP శాఖకు పూర్తి స్థాయి CEO గారిని ఇవ్వడంలేదు!!! ఉన్నత అధికారి ఇన్చార్జి లో SERP ఉండడంతో సిబ్బందికి, యూనియన్ లకు సమస్యల పై విన్నవించేందుకు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదు.. చాలా వరకు చిన్న చిన్న వినతులు, సమస్యలు కూడా సంవత్సరకాలంగా పెండింగ్లోనే ఉన్నాయి..

కావున తక్షణమే ఈ నెల వేతనాలు విడుదల చేయాలని, గతంలో మంత్రి గౌ. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అమలులోకి వచ్చిన అడ్వాన్స్ అండ్ అడ్జస్ట్మెంట్ పద్ధతి ప్రకారం వేతనాలు ఇక నుంచి ప్రతి నెల ఒకటవ తేదీన ఇవ్వాలని, పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము..

ఈ విషయమై SERP ఆధికారులు 4 రోజుల్లో స్పందించకపోతే బుధ, గురు వారాల్లో 4 వేల మంది SERP ఉద్యోగులు, 10 మంది కుటుంబ సభ్యులు కలిపి
40వేల మందితో SERP ముట్టడి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించే పరిస్థితి దాపురించిందని తెలుపుటకు చింతిస్తున్నాము..

ఒక్కొక్కటిగా సెర్ప్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ప్రతినెల సర్ఫ్ ఉన్నతాధికారులు యూనియన్కు ఒకరోజు సమయం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము..

? ఇది కేవలం అధికారుల వైఫల్యం పై నిరసన మాత్రమే!! రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు SERP ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని పార్టీ మేనిఫెస్టోలో రాతపూర్వకంగా హామీ ఇచ్చారు, & ప్రభుత్వం ఇందుకు కొనసాగింపుగా 2వ అసెంబ్లీ తోలి సమావేశం లో గవర్నర్ ప్రసంగంలో కూడా పొందుపరిచింది..
30% పెంపుదల కూడా వర్తింప చేసింది..

Note.. కావున ఇది కేవలం అధికారుల నిర్లక్ష్య వైఖరిపై నిరసన మాత్రమే కానీ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు..
పై సమస్యలను పరిష్కరించి
ఈ నిరసన పరిస్థితులను నివారించాల్సిన పూర్తి బాధ్యత కేవలం SERP అధికారులదే..
50 లక్షల మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వీడాలని ,
SERP సిబ్బంది ని రెగ్యులరైజ్ చేస్తామన్న గౌ.సీఎం కేసీఆర్ గారి హామీ మేరకు SERP అధికారులు మా పై డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాము.