పండగల దృష్ట్యా వెంటనే SERP సాలరీస్ విడుదల చేయాలి : SERP JAC డిమాండ్

Demand immediate release of SERP Salaries in view of the festival

0
110

బతుకమ్మ, దసరా, పండగల దృష్ట్యా వెంటనే SERP సాలరీస్ విడుదల చేయాలని, అదేవిధంగా గత 6సం.లుగా అడ్వాన్స్& అడ్జస్ట్ ట్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి నెలా SERP లో ఒకటవ తేదీన జీతాలు ఇచ్చినట్లుగా ఇపుడు కూడా ప్రతినెలా ఒకటినే సాలరీస్ విడుదల చేసేలా SERP అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని గౌ.CMO కు, గౌ. మంత్రులు KTR, ఎర్రబెల్లి, హరీష్ రావు గార్లకు, గౌ. ఎమ్మెల్సీ కవిత గార్లకు ట్విట్టర్ ద్వారా విన్ననించడం జరిగింది

గత సంవత్సర కాలంగా SERP అధికారులు సాలరీ సరిగా విడుదల చేయడంలేదన్నారు.

పాత పద్దతి ప్రకారం (SERP పథకాల నిధుల్లోంచి అడ్వాన్స్ తీసుకుని 1వ తేదీన సాలరీ ఇచ్చేవారని, మళ్ళీ BRO ప్రకారం బడ్జెట్ రాగానే అడ్జస్ట్ చేసుకునే వారని గుర్తు చేశాము…

కానీ ప్రస్తుతం SERP లో పై విధానాన్ని పాటించకుండా నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారని, దీంతో అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందనే దుస్థితి దాపురించిందనీ ఆవేదన వ్యక్తంచేశారు.

ఇకనైనా గౌ.మంత్రులు KTR, ఎర్రబెల్లి దయాకరరావు, హరీష్ రావు లు, గౌ. ఎమ్మెల్సీ కవిత గార్లు చొరవ తీసుకుని SERP అధికారులతో సమీక్ష చేసి, గత 6సం.లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం SERP లో అవలంభించిన అడ్వాన్స్ & అడ్జస్ట్ మెంట్ పద్దతి తిరిగి అమలులోకి తెచ్చి ప్రతి నెలా ఒకటవ తేదీన సాలరీ ఇచ్చేలా చూడాలని SERP ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకులు కుంట గంగారెడ్డి, ఏపురి నర్సయ్య, మహేందర్ రెడ్డి, సుభాష్, సుదర్శన్ లు డిమాండ్ చేస్తున్నాము..

https://twitter.com/IKP_Gangareddy/status/1445648688307597324?s=08