Flash: టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ హత్య కేసులో ఏడుగురు నిందితులు అరెస్ట్..వాళ్ళు ఎవరంటే?

0
122

మహబూబాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ 8 వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ రవిని కొందరు దుండగులు గొడ్డలితో నరకి చంపిన ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన జరగడానికి ఆర్థిక లావాదేవీల కారణమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.

దుండగుల కోసం పోలీసులు 4 బృందాలను ఏర్పడి తీవ్రంగా గాలించారంతో ఎట్టకేలకు ఏడుగురు నిందితులు దొరికారు. దాంతో ప్రస్తుతం వారిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. అక్రమ బెల్లం, కలప పోలీసులకు పట్టిస్తున్నాడని కక్షతో హత్య చేసినట్టు ఎస్పీ తెలిపారు.

వాళ్ళు ఎవరంటే..భూక్య వినయ్, భూక్య అరుణ్, అజ్మీర బాలరాజు, గుగులోతు చింటు, కారపాటి సుమంత్, అజ్మీర్ కుమార్, గుగులోతు బావుసింగ్, అనే వ్యక్తులు ప్రస్తుతం కాస్టర్ది లో ఉన్నట్టు తెలిపారు. వారి నుండి కారు, ట్రాక్టర్, గొడ్డలి, 7సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.