షర్మిల vs జగ్గారెడ్డి..ముదిరిన మాటల యుద్ధం..మరోసారి నోరు జారితే అంటూ..

0
87

YSR తెలంగాణ ఇంటి పార్టీ అధినేత్రి షర్మిల, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. నిన్న జగ్గారెడ్డిని రాజకీయ వ్యభిచారి అంటూ షర్మిల వ్యాఖ్యానించడంపై జగ్గన్న గట్టిగానే స్పందించారు. నేను రాజకీయ వ్యభిచారినా? అదే మాట నిన్ను అంటే ఎలా ఉంటుంది. నువ్వు రాజశేఖర్ బిడ్డవి. కానీ నీకు ఆయన లక్షణాలు రాలేదని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.మరోసారి నోరు జారితే ఇతర విషయాలు మాట్లాడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.