శాసనమండలి రద్దు విషయంలో జగన్ కు మరో షాక్

శాసనమండలి రద్దు విషయంలో జగన్ కు మరో షాక్

0
87

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీల మధ్య తాజాగా ఈ రాజధాని అంశం వివాదంగా మారింది., అమరావతి రాజధాని మార్పు విషయంలో వైసీపీని గెలవనివ్వకుండా చేయాలి అని చూస్తున్నారు తెలుగుదేశం నేతలు.. ఇప్పటికే ఈ బిల్లుని సెలక్ట్ కమిటీకి సిఫార్స్ చేశారు, మండలి చైర్మన్ షరీఫ్.

దీంతో సీఎం జగన్ కూడా కీలక నిర్ణయం తీసుకోవాలి అని శాసన మండలిని రద్దు చేయాలి అని అనుకుంటున్నారు అయితే అది అంత సులువుగా అయ్యే పనా అని ప్రశ్న వస్తోంది…మండలిని రద్దు చేయాలంటే ముందుగా శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టాలి. సభ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపాలి. అక్కడ ముందుగా లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టొచ్చు. రెండు సభల్లో రద్దు తీర్మానం ఆమోదం పొందితే ఫర్వాలేదు. ఒకవేళ రెండింటిలో ఎక్కడ ఏ సభ తిరస్కరించినా మళ్లీ బిల్లు వెనక్కి వస్తుంది.

అయితే మళ్లీ బిల్లు శాసనసభలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపాలి… అప్పుడు ఆమోదం పొందితే దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు… అప్పుడు మండలి రద్దు అవుతుంది. అంత ప్రాసెస్ ఉంది, అయితే ఇదేమి అంత తొందరగా జరిగేది కాదు, బీజేపీ చేయాలి అని అనుకుంటే నెల లేదా వారంలో చేయవచ్చు లేదంటే ఆరునెలలు సంవత్సరం కూడా పట్టవచ్చు..ఒకవేళ పార్లమెంట్ ఆమోదం లభించకపోతే మాత్రం.. శాసన మండలి రద్దు కష్టమేనని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.