వైయస్ కు శాసనమండలి ఏర్పాటు సులువుగా అవ్వలేదు చాలా ఇబ్బందులు పడ్డారట

వైయస్ కు శాసనమండలి ఏర్పాటు సులువుగా అవ్వలేదు చాలా ఇబ్బందులు పడ్డారట

0
86

ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ శాసన మండలిని రద్దు చేసిన తర్వాత , పలువురు ఏర్పాటు దిశగా చూశారు.. కాని అది ఎక్కడా కుదరలేదు, అయితే మళ్లీ 2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మండలిని పునరుద్ధరించాలంటూ 2004 చివర్లో శాసనసభలో తీర్మానం చేశారు. అయితే చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా ఇది కావాలి అని కోరుకున్నారు టీడీపీ నేతలు కూడా ఉండాలి అని భావించారు.

అప్పుడు వైఎస్ కు దేశంలో ఏపీలో తిరుగులేని నాయకుడు. అయినప్పటికీ… సులువుగా ఆమోద ముద్ర వేయించుకోలేకపోయారు. దీనికోసం భారీగా లాబీయింగ్ అవసరమైంది. మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజుకు వైఎస్ ఈ బాధ్యతలు అప్పగించారు. కౌన్సిల్ను పునరుద్ధరిస్తే మీకు ఎమ్మెల్సీ ఇస్తా అని ఆయనకు హామీ ఇచ్చారు.

అప్పటి కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్తో ఉన్న సంబంధాలతో కంతేటి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఢిల్లీకి పలు సార్లు వెళ్లి ఆయన సులువుగా కేంద్రంతో చర్చించి చేయించారు. దీంతో… ఆయన పేరు కౌన్సిల్ రాజుగా మారిపోయింది. పాటిల్ ఒత్తిడితో బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. వైఎస్ అనుకున్న మూడేళ్లకు 2007లో మండలి మళ్లీ మొదలైంది. ఇలా ఆనాడు మళ్లీ మండలి స్టార్ట్ అయింది.