కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘కేంద్ర బడ్జెట్‌లో అందరికీ గుండు సున్నా.. గోల్‌మాల్ గోవిందం’ అని విమర్శించారు. బడ్జెట్ చాలా దారుణంగా ఉందని ఆక్షేపించారు. ఆర్థికమంత్రి చెప్పింది శాంతి మార్గం.. చేసింది అధర్మమని ఆరోపించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆత్మవంచన చేసుకుని… దేశ ప్రజలను వంచించారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌లో రూ.12,800 కోట్లే కేటాయించారు. ఎస్సీల జనాభాపై కేంద్రం అబద్ధాలు చెబుతోంది. ఎరువులపై రూ.35 వేల కోట్ల రాయితీ తగ్గించారు. ఉపాధి హామీ పథకంలోనూ రూ.25 వేల కోట్ల కోత. విద్యుత్ విధానం చెత్తగా ఉందని మండిపడ్డారు.
అందరికి గుండు సున్నా..బడ్జెట్ అంతా గోల్‌మాల్ గోవిందం: కేసీఆర్
Shave zero for everyone..all budget Golmal Govindam: KCR