శబరిమల అయ్యప్ప భక్తులకోసం దేవస్ధానం కీలక ప్రకటన

శబరిమల అయ్యప్ప భక్తులకోసం దేవస్ధానం కీలక ప్రకటన

0
91

దేశంలో కార్తీక మాసం నుంచి అయ్యప్ప మాలదారణ వేసుకునేవారు చాలా మంది ఉంటారు, లక్షలాది మంది స్వామిని దర్శించుకుంటారు, ఇక జనవరి వచ్చిందంటే అందరి మనస్సు మకరజ్యోతి పైకే వెళ్తుంది. లక్షలాది భక్తులు శబరిమలైలో అయ్యప్పస్వామి దేవాలయం నుంచి మకరజ్యోతి దర్శనం చేసుకుంటారు. ఇక అయ్యప్ప దేవాలయంలోకి డిసెంబరు 30 నుంచి జనవరి 20 వరకు స్వామివారి దర్శనం కోసం భక్తులను అనుమతిస్తారు

ఈ ఏడాది మకరజ్యోతి జనవరి 15న దర్శనం ఇవ్వనుంది. మకర సంక్రాంత్రి జనవరి 15న కాబట్టి, అదే రోజు మకరజ్యోతి దర్శనం ఇస్తుందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. 20 వ తేది వరకూ స్వామి ఆలయం తెరచి ఉంటుంది. జనవరి 21న ఆలయాన్ని మూసివేస్తామని వెల్లడించారు.
ట్రావెన్కోర్ దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది.శబరిమల అయ్యప్ప ఆలయ గర్భగుడి సమీపానికి మొబైల్ ఫోన్ లు తీసుకెళ్లడం నిషేధిస్తూ దేవస్తానం బోర్డు నిర్ణయం తీసుకుంది.

అయితే దీనికి కారణం కూడా ఉంది.. ఎన్నడూ లేని విధంగా ఆలయంలో ఫోటోలు అలాగే దేవాలయం చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. దీనిపై దేవస్ధానం కేరళ సర్కార్ సీరియస్ అయింది.. అందుకే ఫోన్లు తీసుకురాకూడదు అని నిషేదం విధించారు..మరి చూశారుగా ఈ విషయాల్లో భక్తులు స్వామిమాల వేసుకున్న వారు జాగ్రత్తలు తీసుకోండి అని చెబుతున్నారు గురుస్వాములు అయ్యప్ప భక్తులు.