దేశ వ్యాప్తంగా ఆలయాలు అన్నీ మూసివేసి ఉన్నాయి, ఈ లాక్ డౌన్ సమయంలో పెద్ద ఎత్తున మన దేశంలో ప్రముఖ ఆలయాలు అన్నీ మూసివేశారు, భక్తులు ఎవరూ కూడా రాని పరిస్దితి, ఈ సమయంలో ఆలయాలకు వచ్చే విరాళాలు నిత్య ఆదాయాలపై ఇది ఎఫెక్ట్ చూపిస్తోంది, తాజాగా తిరుమలకు కూడా ఇది ఎఫెక్ట్ చూపించింది.
ఇక షిరిడిలో కూడా ఇలాంటి పరిస్దితి ఉంది. పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయింది సాయి ఆలయం..ప్రతీ రోజు రూ. 1.5 కోట్లకు పైగా ఆదాయాన్ని నష్టపోతోంది. మార్చ్ 17 నుంచి మే 3వ తేదీ వరకు ఆన్ లైన్ డొనేషన్ల రూపంలో ఆలయానికి రూ. 2.53 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. ఈ లెక్కన రోజుకి షిరిడికి కేవలం 6 లక్షలు మాత్రమే డొనేషన్ల రూపంలో వచ్చింది.
ఇక హుండీ ఆదాయం పెద్ద లేదు అనే చెప్పాలి, షిర్డీ ఆలయానికి విరాళాల రూపంలో ఏడాదికి రూ. 600 కోట్ల ఆదాయం వస్తుంది అంటున్నారు, అంటే దాదాపు రోజుకి 1.64 కోట్ల రూపాయల ఆదాయం, కాని రోజుకి కేవలం 6 లక్షలు మాత్రమే ఇప్పుడు వచ్చింది… ఇలా సుమారు 150 కోట్ల వరకూ ఆదాయం కోల్పోయింది అంటున్నారు, అయినా సాయినాధునికి ట్రస్టుకి సంబంధించి అన్నీ కార్యక్రమాలు చేపడుతున్నారు అధికారులు.