జగన్ కు షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే శిల్పా బ్రదర్

జగన్ కు షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే శిల్పా బ్రదర్

0
82

సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బీజేపీ చాలా మంది ఎంపీల మద్దతు కూడగట్టుకుంది. కొందరు దీనిని వ్యతిరేకిస్తే మరికొందరు దీనిని స్వాగతిస్తున్నారు.. ఏపీలో వైసీపీ కూడా పార్లమెంట్లో ఈ బిల్లుకు మద్దతు ఇచ్చింది, దీనికి బీజేపీకి సపోర్ట్ చేసింది. సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు తమ పార్టీ మద్దతివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు.

ఇది వైసీపీకి నిజంగా షాక్ అనే చెప్పాలి, సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వైసీపీ ఎంపీలు మద్దతివ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. చట్టం అమల్లో భాగంగా ముస్లింలకు ఇబ్బందులు తలపెడితే సహించేది లేదన్నారు. అవసరమైతే రాజీనామా చేసేందుకూ వెనుకాడనని స్పష్టం చేశారు.అయితే జగన్ కు ఈ విషయంలో ఏ ఎమ్మెల్యే కూడా అడ్డుతగలలేదు.

మైనార్టీ ఎమ్మెల్యేలు కూడా దీనిపై ఏమీ అనలేదు.. కాని ఇటు శిల్పా సోదరుడు ఇలా కామెంట్ చేయడం పై పార్టీనేతలు చర్చించుకుంటున్నారు, దీనిపై నేరుగా సీఎంతో ఆయన చర్చించారట, దీనిపై ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు అని తెలిపారట.