దేశంలో పలు ప్రాంతాల నుంచి షిరిడీ సాయి బాబాను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు షిరిడి వెళుతూ ఉంటారు, అయితే అన్నీ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది షిరిడి మందిరం.
ఇక బాబాని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఆలయ ట్రస్టు నిర్వాహకులు కీలక సూచనలు చేశారు. దర్శనానికి వచ్చే వారు మన దేశ సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని కోరారు. ఇది తమ రిక్వెస్ట్ అని తెలిపారు, దీనికి కారణం ఉంది, అయితే ఇక్కడ ఆలయంలో ఎలాంటి డ్రస్ కోడ్ నిబంధన లేదు.
అయితే శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఇలా ఎందుకు చెప్పింది అంటే..గతంలో కొందరు అభ్యంతరకర దుస్తులతో ఆలయంలోకి రావడంపై ఫిర్యాదులు అందాయని.. మిగిలిన భక్తులు కూడా ఇలాంటి వాటిపై ఫిర్యాదులు చేశారు అని అందుకే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.
8 నెలల తర్వాత ఇటీవల భక్తులకి బాబా దర్శనం జరుగుతోంది. కోవిడ్ వల్ల ఇక్కడ దర్శనాలు నిలిపివేశారు..గంటకు 900 చొప్పున ప్రతి రోజు 6000 మందిని మాత్రమే ఆలయం లోపలికి అనుమతిస్తున్నారు.. ఇక భక్తులు ఆన్ లైన్ టికెట్ తీసుకుని మాత్రమే దర్శనానికి రావాలి.