సాయిభక్తులకి ఇది షాకింగ్ వార్త అనే చెప్పాలి…షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసి వేయనున్నట్లు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. ఇది సాయి భక్తులకు షాక్ కి గురిచేసింది.. దీనికి కారణం ఉంది, ఇటీవల సాయి బాబా జన్మస్థలం పత్రి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు, దీంతో చాలా మంది ఆ ప్రాంతంలో సాయి మందిరం నిర్మిస్తారు అని భావించారు చివరకు అలాగే జరుగుతోంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల పర్భణీ జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు. జిల్లాలోని పత్రిని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. షిరిడీతో సమానంగా అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు. కానీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయంపై షిర్డీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రిని అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని ఆందోళన వెలిబుచ్చింది. కాని ప్రభుత్వం మాత్రం అక్కడ గుడి నిర్మాణానికి పూనుకుంటోంది.
ఆదివారం నుంచి సాయి ఆలయంలో అన్ని కార్యక్రమాలూ నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో అనూహ్యమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ..అయితే భక్తులు మాత్రం తాము ఏం చేయాలి అని డైలమాలో ఉన్నారు.. షిరిడిలో ఆదివారం నుంచి భక్తులు వచ్చినా సాయి దర్శనం ఉండకపోవచ్చు