వారు కొత్తగా వివాహం చేసుకున్నారు… ఎన్నో ఆశలతో ఒకటి అయ్యారు.. కాని ఇలా ఎన్నో ఆశలతో జీవితం స్టార్ట్ చేసుకున్న జంట పాపం దారుణం జరిగింది… పెళ్లి కొడుకు శోభనం రోజే ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని విషాదంలో నెట్టి వేసింది.
శోభనం రోజు రాత్రి ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్లాడు ఈ సమయంలో ఎంత సేపు అయినా అతను రాత్రి ఇంటికి రాలేదు..గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నవ వరుడు.
ఇక కుటుంబసభ్యులు ఆందోళన చెందారు ఎంతకీ రాలేదు అని భయపడ్డారు, అయితే అతని స్నేహితులు తెల్లవారు జామున వెతికితే అతను ఇలా చనిపోయి ఉన్నాడు, ఇలా వధువు కూడా కన్నీరు మున్నీరు అయింది, ఇలా వివాహం చేసుకున్న తర్వాత ఎందుకు చనిపోయాడు తెలీదు అంటున్నారు, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.