Breaking: షాక్‌…”భీమ్లానాయక్” ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు

0
102

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, హీరో రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా మూవీ భీమ్లా నాయక్‌. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను చిత్రబృందం పంచుకుంది.

భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తారీఖున థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఇవాళ జరగాల్సిన “భీమ్లా నాయక్‌” ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు అయింది. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి నేపథ్యంలో.. “బీమ్లా నాయక్‌” ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

“ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు & స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి. గౌరవ సూచకంగా, #Bheemlanayak ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగదు!” అంటూ బీమ్లా నాయక్‌ చిత్ర బృందం ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించాలని చిత్ర బృందం భావించింది.

https://twitter.com/SitharaEnts?