Breaking News : పాలమురు టీఆర్ఎస్ కు షాక్ – 17 మంది రాజీనామా

0
89

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వున్న టిఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నాయకులు తెరాసను వీడారు. ఆ నాయకులతోనే నియోజకవర్గ కారకర్తలు నడుస్తున్నారు. ఇక తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వైఖరి నచ్చక వెల్దండ మండలానికి చెందిన 17 మంది సర్పంచులు మూకుమ్మడి రాజీనామా చేశారు. ఇదే బాటలో ఓ ఎంపీటీసీ, సింగిల్ విండో వైస్ చైర్మన్ కూడా నడిచారు. ఎమ్మెల్యే వైఖరి నచ్చకే తామంతా రాజీనామా చేస్తున్నట్టు టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపతిరెడ్డికి లేఖలు అందజేశారు.