ఏపీ ప్రభుత్వానికి షాక్ – మండలి నుంచి బిల్లు సెలక్ట్ కమిటీకి

ఏపీ ప్రభుత్వానికి షాక్ - మండలి నుంచి బిల్లు సెలక్ట్ కమిటీకి

0
95

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం రాజధాని పై తీసుకుంది, తాజాగా వైసీపీ ప్రభుత్వానికి శాసనమండలిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది… అసెంబ్లీలో నెగ్గించుకున్న బిల్లు మండలిలో మాత్రం ముందుకు వెళ్లలేదు, వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు..

తనకున్న విచక్షణాధికారంతోనే ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని షరీఫ్ తెలిపారు. ఇలా సెలక్ట్ కమిటీకి వెళ్లడంతో దీనిని మూడు నెలలు తాత్సారం జరుగుతుంది అని అంటున్నారు, ఇక చైర్మన్ నిర్ణయంపై మండలిలో అధికార వైసీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది..

టీడీపీ వర్గాలు మాత్రం హర్షం వ్యక్తం చేశాయి. ఉదయం నుంచి మండలిలో సెలెక్ట్ కమిటీ ముందుకు బిల్లులు పంపే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది…. చివరకు విచక్షణ అధికారంతో ఆయన దీనిని సెలక్ట్ కమిటీకి పంపించారు.