ఏపీ సర్కార్ కు షాక్..సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే

0
102
CM Jagan

ఏపీ ప్రభుత్వానికి మరో షాక్‌ తగిలింది. ఆన్‌ లైన్‌ సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఆన్ లైన్లో సినిమా టిక్కెట్ల జీవో నెంబర్ 69ని నిలుపుదల చేయాల్సిందిగా సర్కార్ ను ఆదేశించింది కోర్టు. తాము అనుమతి ఇచ్చే వరకు ఆపాల్సిందేనని పేర్కొంది కోర్టు.

జీవో నెంబర్ 69 జారీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అయితే.. ఈ పిటీషన్‌ ను ఇవాళ విచారించిన ఏపీ హైకోర్టు.. ఆన్‌ లైన్‌ సినిమా టికెట్ల విక్రయంపై స్టే ఇచ్చింది. ఇక ఈ నెల 27వ తేదీకి విచారణ వాయిదా పడింది. దీనిపై జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.