బీజేపీకి షాక్..మరో కేబినెట్​ మంత్రి రాజీనామా

Shock to BJP..another cabinet minister resigns

0
94

ఉత్తర్​ప్రదేశ్​ బీజీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కేబినెట్​ నుంచి సీనియర్​ నేత స్వామిప్రసాద్​ మౌర్య తప్పుకున్న కొన్ని గంటలకే ఇప్పుడు మరో మంత్రి రాజీనామా బాట పట్టారు. పర్యావరణ శాఖ మంత్రి ధారా సింగ్​ చౌహాన్​ కూడా పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో యూపీ ఎన్నికలు జరుగుతాయనగా అక్కడి భాజపా ప్రభుత్వానికి వరుస షాక్​లు తగులుతున్నాయి. మంగళవారం.. మాజీ మంత్రి స్వామిప్రసాద్​ మౌర్య సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు భాజపాను వీడిన సంగతి తెలిసిందే.