Breaking- సీఎం కేసీఆర్ కు షాక్..హైకోర్టు నోటీసులు

0
73

తెలంగాణ సీఎం కేసీఆర్ కు షాక్ తగిలింది. బంజారాహిల్స్‌లో తెరాసకు భూమి కేటాయింపుపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన కోర్టు నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అత్యంత ఖరీదైన భూమిని గజానికి రూ.100 చొప్పున కేటాయించడంతో సీఎస్, సీసీఎల్‌ఏ, రెవెన్యూ సీఎస్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు.