జనసేన పార్టీకి షాక్ – YSRTPలోకి కీలక సీనియర్ నాయకురాలు

0
99

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి చేరుతారో అంచనా వేయలేం. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సైతం YSR తెలంగాణ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. వీరి చేరికతో ప్రాంతీయ పార్టీగా YSR తెలంగాణ పార్టీ బలపడుతోంది.

ఇక తాజాగా మంగళవారం జనసేన పార్టీ తెలంగాణ స్టేట్ సెక్రెటరీ శ్రీదేవి తమ అనుచరులతో కలిసి YSR తెలంగాణ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా శ్రీదేవి మాట్లాడుతూ..వైయస్ షర్మిల నాయకత్వంలో పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. వైయస్ఆర్ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, తిరిగి ఆ పథకాలను తీసుకొచ్చేందుకు వైయస్ షర్మిల కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

YSR తెలంగాణ పార్టీలో తప్ప మహిళలకు తెలంగాణలోని ఇతర పార్టీలలో ప్రాధాన్యత లేదన్నారు. YSR తెలంగాణ పార్టీని స్థానికంగా ముందుకు తీసుకుపోతామని హామీనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో YSR తెలంగాణ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు.