పవన్ కు బిగ్ షాక్ బీజేపీలో చేరికపై చిరు క్లారిటీ

పవన్ కు బిగ్ షాక్ బీజేపీలో చేరికపై చిరు క్లారిటీ

0
115

కేంద్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలో కి వచ్చిన తరువాత ఆపరేషన్ సౌత్ ఇండియా అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది… ముఖ్యంగా ఇరు తెలుగు రాష్టాలపై బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది… 2024 ఎన్నికల నాటికి ఈ రెండు రాష్ట్రాల్లో తమ పట్టు సాధించుకోవాలనే ఉద్దేశంతో బలమైన రాజకీయ నాయకులను తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది…

ఇప్పటికే తెలంగాణకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలను అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు దేశం పార్టీ నాయకులను బీజేపీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే… అయితే ఇదే క్రమంలో రాజ్యసభ సభ్యుడు, జనసేన పార్టీ అధినేత పవన్ సోదరుడు, చిరంజీవిని కూడా బీజేపీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

ఈ వార్తలపై అయన స్పందించారు… తాజాగా ఓ ఇంటర్వ్యూలో అయన మాట్లాడుతూ తాను ఏ పార్టీలో చేరబోనని, తనపై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చిరంజీవి అన్నారు.. ప్రస్తుతం తన ఆలోచన మొత్తం సినిమాల పైనే అని అన్నారు…