UP లో ప్రాంతీయ పార్టీలకు షాక్..ఖాతా తెరవని ఎంఐఎం

0
72

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ యూపీలో మళ్లీ అధికార పగ్గాలను తిరిగి బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తం 403 మంది సభ్యులతో కూడిన యూపీ అసెంబ్లీలో..మ్యాజిక్ ఫిగర్ 202 స్థానాలు.  అధికార బీజేపీ 263 స్థానాల్లో అధిక్యంతో భారీ మెజార్టీ దిశగా దుసుకుపోతోంది.

అయితే ప్రాంతీయ పార్టీలకు యూపీ ఓటర్లు షాక్ ఇచ్చారు. బిజెపి ఓడిపోతే ఏదో ఒక రకంగా తమ హవా కొనసాగించవచ్చని ఆశ కాస్త నిరాశగానే మారింది. మరోసారి బీజేపీకే పట్టం కడుతూ ప్రాంతీయ పార్టీలకు ఆశా భంగం కలిగించే విధంగా యూపీ ప్రజలు తీర్పు ఇస్తున్నారు. అలాగే ఎంఐఎం పార్టీ ఒక్క స్థానం లో కూడా ఖాతా తెరవలేకపోయింది.