తెలంగాణలో కారు పార్టీ జోరు కనపిస్తోంది మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో.. అసలు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అలాగే తర్వాత పార్టీ బీజేపీ ఎక్కడా తన సత్తా చాటలేకపోయాయి.. అసలు 10 శాతం కూడా వారి జోరు లేదు అని చెప్పాలి.. తెలంగాణ అంతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను స్వీప్ చేసే దిశగా టీఆర్ఎస్ దూసుకుపోతోంది.
మరోవైపు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఎంపీ రేవంత్ రెడ్డికి మరోసారి నిరాశ ఎదురైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే టీఆర్ ఎస్ ని బంతి ఆట ఆడుకుందాం అనుకున్న కాంగ్రెస్ కు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి…. తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ లో సైతం టీఆర్ఎస్ సత్తా చాటింది. 12 వార్డులకు గాను 8 వార్డులను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. కేవలం మూడు వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. కాంగ్రెస్ ను గెలిపించుకునేందుకు రేవంత్ తీవ్రంగా శ్రమించినా ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రాలేదు.
అయితే తన సెగ్మెంట్ లో ఇలాంటి ఫలితాలు రావడంతో రేవంత్ నిరాశ చెందారు, రెండు సార్లు ఇప్పటికే అక్కడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు రేవంత్.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని అందుకున్నారు. కాని ఇక్కడ స్ధానికంగా మున్సిపోరులో మాత్రం ఓటమిపాలయ్యారు.