టీఆర్ఎస్ ప్రభుత్వం ఒంటిపూట బడుల టైమింగ్స్ పై కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పాఠశాలల సమయం కేవలం 11 : 30 వరకు ఉండగా..ప్రస్తుతం ఎండలు తీవ్రత తగ్గడంతో నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 30 వరకు కొనసాగనున్నాయి రాష్ట్ర విద్యా శాఖ తెలిపింది. అంతేకాకుండా పదో తరగతి విద్యార్థులకు 12 : 30 గంటల నుంచి 1 గంటల వరకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని వెల్లడించింది.