Election Results: ముగ్గురు సీఎం అభ్యర్థులకు షాక్..!

0
78

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఐదు రాష్ట్రాలకు గత నెల 10 నుంచి ఈ నెల 7 వరకు వివిధ విడతల్లో పోలింగ్‌ జరిగింది. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు దశల్లో ఓటింగ్‌ను నిర్వహించారు. మణిపుర్​లో రెండు దశల్లో పోలింగ్​ జరగగా.. పంజాబ్​, ఉత్తరాఖండ్​, గోవాలో ఒకే దశలో పోలింగ్​ పూర్తయింది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో పలు పార్టీల సీఎం అభ్యర్థులకు ఓటర్లు షాక్ ఇచ్చారు. పంజాబ్ లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చరణ్ జీత్ సింగ్ చన్నీ తాను పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు. ఇక గోవాలో బీజేపీ సీఎం అభ్యర్థి, ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ వెనుకంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ ప్రస్తుత సీఎం, సీఎం అభ్యర్థి పుష్కర్ సింగ్ ధామి కూడా వెనుకంజలో ఉన్నారు.