టిఆర్ఎస్ కు షాక్..హస్తం గూటికి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే

0
88
Hath se Hath Jodo

తెలంగాణాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వలసలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే హస్తం పార్టీ నుండి గులాబీ పార్టీకి వలసలు పెరిగాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ లోకి చేరికల పరంపర కొనసాగుతోంది. ఇక తాజాగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రవీణ్ రెడ్డి 2014లో వోడితెల సతీష్ కుమార్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఢిల్లీలో రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ప్రవీణ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.