టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ కు షాక్

0
83

మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ సీనియర్ లీడర్ కర్నె ప్రభాకర్ కు అవమానం జరిగింది. లిస్టులో పేరు లేదంటూ తెలంగాణ భవన్ లోకి ఆయనను  పోలీసులు అనుమతించలేదు. టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరుకావాల్సి ఉంది. తాను ఎంత చెప్పిన పోలీసులు పట్టించుకోలేదు. తెలంగాణ భవన్ ఇంఛార్జ్ శ్రీనివాస్ రెడ్డికి కాల్ చేసినా ఆయన లిఫ్ట్ చేయకపోవడంతో చాలా సేపు గేట్ బయటే వెయిట్ చేశారు కర్నె ప్రభాకర్. తర్వాత లోపలి నుంచి వచ్చిన కొంత మంది ఆయనను రానివ్వాలని కోరడంతో పోలీసులు పర్మిషన్ ఇచ్చారు.