టీఆర్ఎస్ పార్టీకి షాక్..!

Shock to TRS party ..!

0
67

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి షాకులు తగులుతున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితమో లేక ఇంకేదో గానీ కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరూ పార్టీ అధిష్టానం నిర్ణయాలపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తాజాగా కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించి భంగపడ్డ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రెబల్ గా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా కరీంనగర్ మాజీ మేయర్, ప్రస్తుత 51 డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీంద్ర సింగ్ టీఆర్ఎస్ పార్టీని వీడి బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ బరిలో నిలుస్తానని ప్రకటించనున్నట్లు సమాచారం.