యూపీ సీఎం యోగికి షాక్- మంత్రి రాజీనామా..మరొకరు..

0
101

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు షాక్ తగిలింది. ఇప్పటికే జలశక్తి మంత్రి దినేశ్ కార్తీక్ రాజీనామా చేయగా..భాజపా పెద్దలను కలుసుకునేందుకు మరొక మంత్రి దిల్లీకి వెళ్లారు. మరోవైపు యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన జితిన్ ప్రసాద కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

‘నా సామాజిక వర్గం కారణంగా నాకు గౌరవం దక్కడం లేదు. ఒక మంత్రిగా నాకు ఎలాంటి అధికారం లేదు. నేను మంత్రిని కాబట్టి నాకో కారు ఇచ్చారు. నన్ను ఏ సమావేశానికి పిలవడం లేదు. నాకు ఏ పని అప్పగించడం లేదు. బదిలీల్లో అవినీతి చోటుచేసుకుంది. దాని గురించి అడిగితే సమాచారం ఇవ్వడం లేదు. నా శాఖ కార్యదర్శి నా మాట వినడం లేదు. నమామీ గంగ పథకంలో కూడా అవినీతి చోటుచేసుకుంటోంది. ఇవన్నీ నన్ను బాధకు గురిచేశాయి’ అని ఆరోపిస్తూ జలశక్తి మంత్రి దినేశ్ కార్తీక్ రాజీనామా సమర్పించారు.

ఈ పరిణామాలపై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్ స్పందించారు. ‘భాజపా ప్రభుత్వ అవినీతి వరుస క్రమాన్ని గమనించండి. మొదట ప్రజాపనుల విభాగం, తర్వాత ఆరోగ్య శాఖ, ఇప్పుడు జల శక్తి శాఖ. తర్వాత ఎవరని ప్రజలు అడుగుతున్నారు’ అంటూ విమర్శలు చేశారు.