వాహనదారులకి ఏప్రిల్ నుంచి షాక్

వాహనదారులకి ఏప్రిల్ నుంచి షాక్

0
93

వాహనాల నుంచి విడుదలవుతున్న కాలుష్య ఉద్గారాలను తగ్గించాలి అని దానికి అనుగుణంగా మోటార్ కంపెనీలు అలాగే బైక్ కంపెనీలు వర్క్ చేయాలి అని ప్రభుత్వం చెబుతోంది.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి బైక్ కార్లు తయారు చేస్తున్నారు.. అయితే భారత్ లో కూడా తాజాగా కొత్త నిబంధనలు తీసుకువస్తున్నారు.

భారత్ స్టేజ్-4 బీఎస్-4 ప్రమాణాలు కలిగిన వాహన విక్రయాలను నిషేధించింది. దీంతో ఏప్రిల్ నెల నుంచి కేవలం ఏ కంపెనీ వాహనం అయినా బీఎస్ 9 ప్రమాణాలు కలిగిన వాహనాలు మాత్రమే అమ్మాల్సి ఉంటుంది, పాత వాహనాలు ఇక అమ్మరు. అయితే ఈ వాహనాలు కూడా కాస్త రేట్లు అధికంగానే ఉంటాయి అని చెబుతున్నారు.

దీనికి అనుగుణంగా ఫలితంగా పెట్రోలు, డీజిల్ ధరలు యాభై పైసల నుంచి రూపాయి వరకు పెరగనున్నాయి. ఇందనంలో కూడా మార్పులు చేయాలి,
బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేసేలా రిఫైనరీలను మార్చడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.17 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. మొత్తంగా అన్ని పరిశ్రమలు కలిసి రూ.30 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాయి. అందుకే పెట్రోల్ డీజీల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు. దాదాపు లీటర్ కి రూపాయి నుంచి రెండు రూపాయలు పెరుగుతుంది అని చెబుతున్నారు.