కొందరు కేటుగాళ్లు పెళ్లి అనే పదానికి బంధానికి విలువ ఇవ్వరు… ఆలిని పట్టించుకోరు తాళిని లెక్క చేయరు, ఇష్టం వచ్చినట్లు వివాహాలు చేసుకుంటారు.. ఇలా మోసం చేస్తూ చాలా మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తారు, ఇతన్నీ చిన్నపిల్లాడిలా భావించారు అందరూ కాని వీడు చేసిన ముదురు పనికి అందరూ షాక్ అయ్యారు.
ప్రేమ పేరుతో అమ్మాయిలకు వలవేసి వారిని, ఒకరికి తెలియకుండా మరోకరి చొప్పున 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. తమిళనాడులోని విల్లివాక్కం పోలీసులు ఇప్పుడు ఈ మోసగాడ్ని అరెస్ట్ చేశారు.. ఈ కేటుగాడి పేరు లవ్లీ గణేష్23 సంవత్సరాలు.
ఇక ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకుని ఆమెతో కాపురం పెట్టాడు, ఇలా ఇంట్లో పనికి అని ఓ అమ్మాయిని తీసుకువచ్చి ఆమెతో చనువుగా ఉన్నాడు, దీంతో భార్య అతనిపై పోలీసులకి ఫిర్యాదు చేస్తే అతని వ్యవహారాలు అన్నీ బయటపడ్డాయి. ఇలా 11 మందిని వివాహం చేసుకుని మోసం చేశాడు.