హైదరాబాద్ శివారులోని ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు లోతైన విచారణ చేశారు,
అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి, పోలీసులు రావడంతో ఆ యువతిని అక్కడ వదిలేసి పారిపోయారు ఈనిందితులు, ఇక నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరు గతంలో కూడా ఇలా ముఠాగా ఏర్పడి పలువురిపై అత్యాచారం చేశారు అని తేలింది.
అయితే ఈ విద్యార్దిని రోజూ బస్సు దిగి అక్కడ నుంచి ఆటోలో ఇంటికి వెళ్లేది.. ఇలా పలుసార్లు అతని ఆటో ఎక్కింది..
ఇలా ఆమెపై కన్నుపడింది ఆ డ్రైవర్ కు… ఇలా ఆమెని కిడ్నాప్ చేయాలి అని తన స్నేహితులకి చెప్పాడు, బుధవారం ఆమె ఆటో ఎక్కడంతో ఈ పథకం వేశాడు.
తను దిగాల్సిన స్టాపులో ఆమెని దింపకుండా వేగంగా ఆటో నడిపారు, దీంతో ఆమె తల్లికి ఫోన్ చేసి చెప్పింది.
వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు, ఇలా ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా ఆమెని కాపాడారు, ఆమెకి మత్తుమందు ఇచ్చి రేప్ చేసినట్లు తెలుస్తోంది.. కాలేజీ ఉద్యోగాలకు ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుంటారట ఈ ముఠా.. ఓ పది రోజులు వారిని అబ్జర్వ్ చేసి వారిపై ఇలా దాడి చేస్తారు. గతంలో నలుగురిపై ఇలా దారుణం చేశారట.