పెళ్లికూతురు కాళ్లు మొక్కిన వరుడు- ఎందుకో తెలుసా !

Sean revers in Marriage

0
111

పెళ్లంటే రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల బంధం, ఓ కొత్త జీవితం, ప్రతీ వ్యక్తి జీవితంలో తన పెళ్లిపై ఎన్నో కలలు కంటాడు, ఆ సమయం వచ్చే సరికి ఎక్కడా లేని ఆనందం వారి కళ్లల్లో కనిపిస్తుంది. అయితే ఎక్కడ వివాహం జరిగినా పెళ్లి కూతురు ఆ పెళ్లికొడుకు కాళ్లకి మొక్కి నమస్కరిస్తుంది, భారత్ లో ఎక్కడ వివాహం జరిగినా ఈ సంప్రదాయం కనిపిస్తుంది.

ఇక తనే నా జీవితం తనతోనే నా ప్రయాణం అని ఏడు అడుగులు నడుస్తుంది, అయితే ఇక్కడ వెరైటీగా ఓ పెళ్లికొడుకు పెళ్లికూతురు కాళ్లకి నమస్కరించాడు, ఇది చూసి అందరూ షాక్..! మరి దీనికి ఓ పెద్ద కారణం చెబుతున్నాడు వరుడు.

ఇదేమిటి మనోడు ఇలా అమ్మాయి కాళ్లు మొక్కాడు అని బంధువులు స్నేహితులు షాక్ అయ్యారు.. ఇక అబ్బాయి ఏం చెప్పాడు అంటే, తన వంశాన్ని అభివృద్ధి చేయడానికి మెట్టినింటికి వస్తున్న ఈ అమ్మాయిని జీవితాంతం ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను, అసలు నేను ఎవరో తెలియదు అయినా నాపై నమ్మకంతో నాతో మెట్టినింటికి వస్తుంది. ఇంత త్యాగం మరెవ్వరూ చేయరు.. కన్నవాళ్లను, తోబుట్టువులను వదిలి తన కోసం వస్తోంది, అందుకే ఆమె కాళ్లకు దండం పెట్టానన్నాడు. ఇది యూపీలో జరిగినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.