శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర వెండి పెరిగింది టుడ్ రేట్స్

శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర వెండి పెరిగింది టుడ్ రేట్స్

0
115

గడిచిన వారం రోజులుగా చూస్తే బంగారం ధర పెరుగుతోంది కాని ఎక్కడా తగ్గడం లేదు… తాజాగా బంగారం ధర మాత్రం పరుగులు పెట్టకుండా నెమ్మదించింది, మార్కెట్లో బంగారం ధర తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కాని వెండి ధర మాత్రం ఊహించని దిశలో పరుగులు పెడుతోంది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంధర రూ.210 దిగొచ్చింది. దీంతో ధర రూ.45,230కుచేరింది అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.140 తగ్గుదలతో రూ.49,010కు దిగొచ్చింది. అయితే వెండి ధర మాత్రం షాకిచ్చింది, కిలో వెండి ధర పెరిగింది, సుమారు 700 పెరిగింది, దీంతో 48700 కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ 1705.45 డాలర్లకు చేరింది.

ఇక బంగారం ఇప్పుడు తగ్గే సూచనలు కనిపించడం లేదు.. మరికొన్ని రోజులు ఇలాగే రేట్లు ఉంటాయి అంటున్నారు, మార్కెట్లో పసిడికి బ్రేకులు పడవు అంటున్నారు, ఈ ఏడాది బంగారం కచ్చితంగా పది గ్రాములు 60 వేలు దాటుతుంది అంటున్నారు.