సిద్దిపేట జవాన్ మిస్సింగ్..ఆచూకి కోసం మూడు టీంలు: అడిషనల్ డీసీపీ

Siddipet Jawan Missing..Three teams for locating: Additional DCP

0
78

తెలంగాణ: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన సాయికిరణ్​రెడ్డి(22) కనిపించకుండా పోయాడు. సాయికిరణ్ రెడ్డి 15 నెలల క్రితం ఆర్మీ జవాన్ గా ఎంపికై పంజాబ్ ఫరిద్ కోట రెజ్మెంట్ లో విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 17న ఫరిద్ కోట నుంచి సెలవుపై ఇంటికి వచ్చాడు.

ఈ నెల 5న తిరిగి వీధుల్లో చేరడానికి ఇంటి నుంచి బయలు దేరి శంషాబాద్ విమానాశ్రయంలో 9 రాత్రి గంటలకు విమానం ఎక్కాడు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ టర్మీనల్ 2లో దిగాడు. అతను దిగినట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ఢిల్లీ నుంచి లోకల్ ట్రైన్ లో ఫరిద్ కోటకు మరో జవాన్, లోకల్ వైద్యుడు మనీష్ తో కలిసి బయలుదేరాడు. కెప్టెన్ నిఖిల్ శర్మకు రిపోర్ట్ చేయాల్సి ఉంది. మరుసటి రోజు ఇండియాలో ఆ ఇద్దరు దిగి వెళ్లిపోయారు.

ఆ తరువాత సాయికిరణ్ రెడ్డి ఆచూకీ లభించడం లేదు. ఈ నెల 10న తండ్రి పటేల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. జీరో FIR కింద కేసు నమోదు చేశాము. సాయి కిరణ్ రెడ్డి ఫోన్ చివరి లోకేషన్ డిసెంబర్ 6న హర్యానాలోని జకాన్ మండి వద్ద లోకేట్ అయింది.

ఇందిరాగాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్, ఫరిద్ కోట పోలీస్ స్టేషన్లకు FIR ట్రాన్సఫర్ చేశాము. సిద్దిపేట జిల్లా వాసి కావడంతో ప్రత్యేకంగా మూడు టీమ్ లు ఏర్పాటు చేసి.. విచారణ చేపట్టాము. ఈ విషయాలన్నీ కూడా కెప్టెన్ నిఖిల్ సామకు వివరించామని సిద్దిపేట అడిషనల్ డీసీపీ శ్రీనివాసులు చెప్పారు.