11 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు కాస్త పెరుగుదల నమోదు చేసింది… అయితే స్వల్పంగానే పెరుగుదల నమోదు చేసింది బంగారం.. ఒక్కసారిగా వెండి బంగారం ధరలు పరుగులు పెట్టడంతో. మళ్లీ పెట్టుబడి దారులు బంగారంపై ఆశలు పెట్టుకుంటున్నారు.
మరి నేడు హైదరబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగింది. రూ.48,980కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. రూ.200 పెరుగుదలతో రూ.44,900కు చేరింది.
మరి బంగారం ఇలా ఉంటే వెండి ధరలు చూద్దాం..ఏకంగా రూ.1,300 పరుగులు పెట్టింది వెండి. దీంతో వెండి ధర రూ.64,600కు చేరింది. వచ్చే రోజుల్లో వెండి బంగారం ధరలు మరింత తగ్గుముఖం పడతాయి అని తెలియచేస్తున్నారు నిపుణులు.