బంగారం ధర గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చింది, నేడు మాత్రం మార్కెట్లో బంగారం ధర కాస్త తగ్గుదల కనిపించింది, బంగారం ధర మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే వెండి ధర కూడా నేడు మార్కెట్లో డౌన్ అయింది, అయితే వచ్చే రోజుల్లో బంగారం స్దితి ఎలా ఉంటుంది నేడు రేట్లు చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఈరోజు పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గింది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.48,250 ఉండగా.. రూ. 100 తగ్గి రూ.48,150కి ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,250 నుంచి రూ. 49,150కి కు చేరింది.
కిలో వెండి ధర నిన్న రూ.63,600 ఉండగా.. రూ. 400 తగ్గి రూ.63,200కు చేరింది. హైదరాబాద్ మార్కెట్లోనూ కిలో వెండి ధర రూ.63,200గా ఉంది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు. ఇక బంగారం ధర బాటలో వెండి కూడా తగ్గుతుంది అంటున్నారు, వచ్చే ఏడాది జనవరి వరకూ ఇలాగే తగ్గే సూచనలు ఉన్నాయి.