బంగారం ధర నేడు మళ్లీ కాస్త డౌన్ అయింది….ఇప్పటి వరకూ నాలుగు రోజులుగా పరుగులు పెట్టిన పుత్తడి నేడు కాస్త తగ్గుముఖం పట్టింది.. ముంబై బులియన్ మార్కెట్లో బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం కాస్త పరుగులు పెట్టింది, మరి నేడు ధరలు ఎలా ఉన్నాయి బులియన్ మార్కెట్లో చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.310 తగ్గింది. దీంతో రేటు రూ.48,290కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది.. ధర రూ.300 తగ్గడంతో రూ.44,250కు చేరింది.
దాదాపు ఇది వరుసగా బంగారం తగ్గడం రెండో రోజు అంటున్నారు బులియన్ వ్యాపారులు.
బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు మాత్రం పెరిగింది.. కేజీ వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో రేటు రూ.73,300కు చేరింది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధర మరింత తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు వ్యాపారులు.