వినడానికే చాలా బాధగా ఉంది.. నిజమే ఈ దారుణమైన ఘటన జరిగింది ..ఊటుకూరు గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని కు చెందిన కొందరు కూలీలు ఇక్కడ పని నిమిత్తం వచ్చారు వ్యవసాయ కూలీలుగా పనులు చేసుకుంటున్నారు, ఇక్కడ మిరప కోతల పనికి వెళుతున్నారు.
గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు, అయితే రాత్రి పూట అందరూ నిద్రపోతున్న సమయంలో
ఓ పసిపాప గుక్కపట్టి ఏడ్చింది. ఆకలితో ఏడవడంతో ఆమె తల్లి శృతి ప్రమోద్ భోయర్ పాలు ఇచ్చింది ఆ బిడ్డకు.. ఈ సమయంలో అక్కడే ఉన్న పాము చీకట్లో ఆమె స్ధనంపై కాటు వేసింది… వెంటనే తన ప్రాణాల గురించి ఆలోచించలేదు బిడ్డ గురించి ఆలోచించింది ఆ తల్లి.
పామును చేతితో పట్టుకొని దూరంగా విసిరేసింది. అక్కడ మరో యువకుడు ఉంటే అతనిని కూడా కాటేసింది, ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు…మార్గమధ్యలోనే శృతి మరణించింది. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.అక్కడ వారిని ఈ ఘటన కన్నీరు పెట్టించింది.