పాము కాటేస్తే వెంటనే ఈ పని చేయండి ప్రాణాలు కాపాడండి

పాము కాటేస్తే వెంటనే ఈ పని చేయండి ప్రాణాలు కాపాడండి

0
111

మనకు కనిపించేవి అన్నీ విషసర్పాలు కావు అన్నీ కాటు వేస్తే చనిపోరు కొన్ని మాత్రమే విషసర్పాలు, అయితే తాచు, కట్లపాము వంటి 15 శాతం ప్రమాదకరమైన సర్ప జాతులతోనే ప్రమాదం ఉంటుంది.
50 శాతం పాముకాట్లు విషంలేని, ప్రమాదం లేని మామూలు గాయాలే ఉంటాయి, అందుకే జాగ్రత్తగా ఉండాలి, పసర్లు ఇలాంటి వైద్యం కాకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి పాము కరిచిన వెంటనే.

కట్లపాము ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్తకణాల్లో కలుస్తుంది. ప్రమాదం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆసుప్రతిలో చేర్పించాలి. ఇది చాలా వేగంగా శరీరం అంతా చేరుతుంది 20 నిమిషాల్లో ఆస్పత్రికి చేర్చండి.

ఇక నాగుపాము ఇది 15 నిమిషాల్లో శరీరంలో మొత్తం చేరుతుంది, వెంటనే నిమిషం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకువెళ్లాలి.

అలాగే రక్తపింజర ఇది కాటేసిన రెండు గంటల తర్వాత విషం శరీరంలోకి ఎక్కుతుంది. ఇది కూడా డేంజర్ కాలికి గుడ్డకట్టి గట్టిగా వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలి, అసలు కంగారు పడకుండా రోగి ఉండాలి.
జెర్రిపోతు, నీరుకట్టు ఇది కాటేసినా విషం ఉండదు. కాని వాపు వస్తుంది ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. దగ్గర్లో యాంటి స్నేక్ వీనం ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుంది. ప్రాణాపాయం ఉండదు, ఇది అన్నీ పీహెచ్ సీల్లో ఉంటుంది.