ఈ వైరస్ వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతోంది దాదాపు ప్రపంచంలో 206 దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి, ఈ సమయంలో ఎవరూ బయటకు రాని పరిస్దితి అంతా లాక్ డౌన్ లోనే ఉంది. ఈ సమయంలో రంజాన్ మాసం ప్రారంభం అవ్వబోతోంది, అయితే ఈ సమయంలో సౌదీ అరేబియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ముస్లిం సౌదరులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా వెళ్లివచ్చే పవిత్ర మక్కా మసీదును మూసివేయనున్నారు. రంజాన్ మాసంలో ఇలా చేయడం ఇదే ప్రధమం అంటున్నారు,
దీంతో పవిత్ర మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూతపడనున్నాయి. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న వేళ అక్కడ మరింత మంది ప్రార్ధనలకు వస్తే వ్యాప్తి పెరుగుతుంది అని భావించి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
ఇక మన దేశంలోలా సౌదీలో కూడా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ప్రపంచదేశాల నుంచి లక్షలాది మంది మక్కాకు, హజ్ యాత్రకూ వచ్చి, ఇక్కడి మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. ఈ ఏడాది కూడా ముందే అడ్వాన్స్ టికెట్స్ చేసుకున్నారు, ఇక అవన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే అంటున్నారు
ఈ సంవత్సరం ఎటువంటి ప్రార్థనలకూ అనుమతి ఇవ్వబోమని మసీదుల ప్రెసిడెంట్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ప్రతీ ఒక్కరు ఇంటిలోనే ఈ ప్రార్ధనలు చేసుకోవాలి అని తెలిపారు.