డార్జిలింగ్కు చెందిన ఓ మహిళకు కోల్ కతాకు చెందిన మరో యువతితో కొన్నేళ్ల కిందట ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరూ బాగా మాట్లాడుకున్నారు, ఎవరి బాధలు వారు చెప్పుకున్నారు, అంతేకాదు తన ఇంటికి రావాలి అని కోరింది, దీంతో ఆ యువతి డార్జిలింగ్ నుంచి కోల్ కత్తా వచ్చింది.
అయితే ఆమెకి ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పింది, చివరకు రైల్వేస్టేషన్ కు వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకుని ఓ పెద్ద ఇంటికి తీసుకువెళ్లింది, అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఆమెకి ఏమీ అర్ధం కాలేదు, కాని కొంత సేపటికి విషయం తెలిసింది.
ఆమెని ఇక్కడ వ్యభిచార కొంపలో అమ్మేందుకు తీసుకువచ్చింది, మొత్తానికి కొంత నగదుకి ఆమెని అమ్మేసింది, ఇక ఇక్కడ వారి నుంచి ఆమె తప్పించుకుని మొత్తానికి పోలీస్ స్టేషన్ కు చేరింది, అయితే ఆమె ఫోన్ చేసిన నెంబర్, అలాగే సోషల్ మీడియా అకౌంట్ ఇవ్వడంతో ఆమె ఎవరు అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు, ఇలా ఎవరిని నమ్మి ఉద్యోగాలకు వెళ్లి ఇబ్బంది కొనితెచ్చుకోవద్దు అంటున్నారు పోలీసులు