మనుషులు స్నేహం విషయంలో ఎలా ఆచితూచి వ్యవహరిస్తారో అలాగే చింపాంజీలు కూడా ఉంటాయని మీకు తెలుసా, మగ చింపాంజీలు కూడా తమ వయసుకు తగ్గ జంతువులతోనే స్నేహం చేస్తాయని ఒక అధ్యయనం వెల్లడించింది.మగ చింపాంజీలు పుట్టిన గుంపులోనే ఉంటాయి, వేరే గ్రూపుల్లో అంత తొందరగా కలవవు.
ఆడ చింపాంజీలు లైంగికంగా పరిణతి చెందిన తరువాత కొత్త గుంపుల్లోకి వెళ్తాయి. ఈ జంతువులు మనుషులకు దగ్గరి బంధువుల్లా కనిపిస్తాయి. ఇక మనుషుల్లా చింపాంజీలు ఎక్కువ కాలం బతుకుతాయి, ఇవి ఆరోగ్యంగా 60 ఏళ్ల వరకూ ఉంటాయి.స్నేహం చేసే మగ చింపాజీలు కలిసి వేటాడుతాయి.
మాంసాన్ని వేటాడి సమానంగా పంచుకుంటాయి. అవి సమభాగాలు చేసుకుంటాయి, ఇక ఆడచింపాంజీల కంటే మగవి హుషారుగా ఉంటాయి..మగ చింపాంజీలు చిన్న జంతువులకన్నా మెరుగ్గా జెన్యూన్ ఫ్రెండ్షిప్ చేస్తాయి. 35 ఏళ్లు పైబడిన మగ చింపాంజీలు నిజమైన స్నేహితులను ఎంపిక చేసుకుంటాయి. ఇక వయసు పెరిగే కొలది దూకుడు బాగా తగ్గిస్తాయి
చింపాంజీలు.