కొంతమందికి అదృష్టం భలే వరిస్తుంది.. వారి గుమ్మం దగ్గరకే వస్తుంది, అయితే తాజాగా ఓ మహిళలకు అదృష్టం ఇలాగే వరించింది… థాయ్‌లాండ్‌కు చెందిన సిరిపోర్న్ నియామ్రిన్ బీచ్‌లో అలా చల్లగాలికి హాయిగా నడుస్తూ వెళ్తుంది.. ఆమెకి ఓ వస్తువు దొరికింది.. అది చూడటానికి గట్టిగానే ఉంది ముద్ద రూపంలో ఉన్న ఆ వస్తువుని చూసి ఆమె ముందు ఏమిటో అని ఆలోచించింది… అయితే దాని నుంచి చేపల వాసన వచ్చింది.. వెంటనే ఆమె తన ఇంటికి దానిని తీసుకువచ్చింది.
ఇరుగుపొరుగు వారిని పిలిచి అడిగింది. చివరికి అది ఓ వేల్ కడుపులో నుంచి వచ్చిన ముద్ద అని తెలిసింది. అది వేల్ వాంతి ఇది ఏకంగా కోట్లు విలువ చేస్తుంది, ఎందుకు అంటే దీనితో పర్ఫ్యూమ్ లు తయారు చేస్తారట, దీనిని అంబిర్‌గ్రిస్ అంటారు. ఇది స్పెర్మ్ వేల్ పేగుల్లో తయారవుతుంది. ఇది సముద్రంలో మునగదు బయటకు కొట్టుకు వస్తుంది.. చాలా మంది జాలర్లకు అప్పుడప్పుడు దొరుకుతుంది.
దీని విలువ సుమారు 1.8 కోట్లు అని తేలింది, త్వరలో ఆమె దానిని అమ్మనుంది. వారు ఆమెకి చెక్ ఇవ్వనున్నారు.
మొత్తానికి ఈ నగదు తమ ఏరియాలో కొంత డవలప్ మెంట్ కు వాడతాను అని చెప్పింది.
|
|
అదృష్టవంతురాలు బీచ్ లో నడుచుకుంటూ వెళ్తే కోట్లు దొరికాయి ఎలాగంటే
-