రైలులో పొగొట్టుకున్న బంగారు వస్తువు 15 ఏళ్లకు దొరికింది ఎలాగంటే

-

మనకి దక్కాలి అని రాసిపెట్టి ఉంటే దానిని ఎవరూ ఆపలేరు… మనకు రాసి లేదు అంటే ఎంత కష్టపడినా మనకు దక్కదు, నిజమే ..అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. ఇక్కడ ఓ మహిళలకు కూడా అదే జరిగింది.
ఎంతో ఇష్టపడి తయారు చేయించుకున్న బంగారపు వస్తువు.. రైల్లో పోగొట్టుకుంది. ఇక తర్వాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాని ఆ వస్తువు దొరకలేదు.

- Advertisement -

చాలా బాధపడింది. కాని ఊహించని విధంగా 15 ఏళ్ల తర్వాత ఆ పోయిన వస్తువు మళ్లీ తిరిగి వచ్చింది… నిజంగా ఆమె ఆనందానికి అవదుల్లేవు…మహారాష్ట్రలోని థానేలో నివసిస్తున్న మహిళ 2005లో ఎంతో ఇష్టపడి 5.80 మిల్లీ గ్రాముల బంగారంతో వినాయకుడి బొమ్మతో గోల్డెన్ లీఫ్ ని తయారు చేయించుకుంది.

ఓ రోజు లోకల్ రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో పోయింది, వెంటనే రైల్వే పోలీసులకి ఫిర్యాదు చేసింది, ఇక ఇటీవల వారికి ఆ వస్తువు దొరికింది, అయితే ఆమె ఇల్లు మారిపోవడంతో పోలీసులు అన్నీచోట్లా వెతికి చివరకు ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకున్నారు, ఆమె రాయ్ ఘడ్ లో ఉంది అని తెలుసుకుని ఆమెకి ఆ వస్తువు అందచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...